స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

byసూర్య | Fri, Mar 29, 2024, 11:44 AM

ఇళ్ల మధ్య ఉన్న స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ శంషాబాద్ షాబాద్ మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న ప్రియాంక గ్యాస్ గోడౌన్ పక్కనే ఉన్న భారీ స్క్రాప్ గోడౌన్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు చుట్టు పక్కల ఇళ్లకు వ్యాపించడంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇళ్లను ఖాళీ చేయించి అగ్నిమాపక సిబ్బందితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM