కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్

byసూర్య | Sun, Apr 28, 2024, 10:26 PM

లోక్ సభ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రచారం సమయంలో ప్రత్యర్థి పార్టీలపై నేతలు రకరకాల విమర్శలు, ఆరోపణలు చేస్తుండగా.. వాటికి ఎదుటి వారు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన కామెంట్లకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. " దేశ ఆస్తులపై మొదటి హక్కు ముస్లింలకే అని కాంగ్రెస్ చెప్పింది. అంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారికే.. ఆస్తి పంచుతారు. మీరు కష్టపడి సంపాధించిన ఆస్తులు చొరబాటుదారులకు వెళ్లాలా..?" అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.


ముస్లిం సమాజంలోని పురుషులే ఎక్కువగా కండోమ్‌లను వినియోగిస్తు్న్నారని.. చైల్డ్ స్పేసింగ్‌లో ఎక్కువ రికార్డు కలిగి ఉన్నారని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తున్నారంటూ మోదీ చెప్తున్నారంటూ మండిపడ్డారు. అలా అయితే.. నరేంద్ర మోదీకి ఆరుగురు సోదరులు, అమిత్ షాకు ఆరుగురు సోదరీమణులు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కి 10 మంది సోదరీమణులు ఉన్నారంటూ గుర్తు చేశారు.


కేంద్ర గణాంకాల ప్రకారం ముస్లింల సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పడుతోందని అసదుద్దీన్ పేర్కొన్నారు. కానీ.. హిందూ సోదరుల్లో భయాన్ని సృష్టించేందుకు నరేంద్రమోదీ ద్వేషాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ దేశంలో ముస్లింలు ఎప్పటికీ మెజారిటీగా ఉండరన్నారు. ముస్లిం పట్ల ఈ భయాన్ని ఎంతకాలం కొనసాగిస్తారంటూ మోదీని ప్రశ్నించారు. ప్రధాని మోదీ 17 కోట్ల భారతీయ ముస్లింలను చొరబాటుదారులు అంటున్నారని.. దళితులు, ముస్లింల పట్ల ద్వేషమే మోదీ గ్యారెంటీ అన్నారు.


అంతకుముందు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత మసీదుపై విల్లు ఎక్కుపెట్టిన సంజ్ఞ చేయడాన్ని అసదుద్దీన్ నిందించారు. ఇది మసీదుపై బాణం వేయడం కాదని, నగరంలో శాంతిని నాశనం చేయడానికి లక్ష్యంగా చేసుకున్న ప్రయత్నమని అసదుద్దీన్ ఆరోపించారు.


Latest News
 

ప్రభుత్వ ఉద్యోగం పేరుతో మోసం.. పాపం నిరుద్యోగి, చివరకు ఇలా.. Tue, May 14, 2024, 08:12 PM
పోలింగ్ ముగిశాక మందుబాబుల వెతలు.. పగోడికి కూడా ఈ కష్టం రావొద్దు భయ్యా Tue, May 14, 2024, 08:10 PM
అల్లునితో చిల్‌ అవుతున్న బండి సంజయ్.. స్కూటీపై చక్కర్లు, బేకరీలో ఐస్‌క్రీం ముచ్చట్లు Tue, May 14, 2024, 08:09 PM
5 నెలల పసికందును పీక్కుతిన్న పెంపుడు కుక్క Tue, May 14, 2024, 08:07 PM
కొండెక్కిన కోడిగుడ్డు ధర.. మరికొన్ని రోజులు తప్పదు, పెరుగుదలకు కారణమిదే Tue, May 14, 2024, 07:55 PM