78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి

byసూర్య | Sun, Apr 28, 2024, 08:54 PM

నిజామాబాద్‌లో ఓ రిటైర్డ్ ఉద్యోగి చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు. గుండెల్లి ఎల్లాగౌడ్‌.. 78 ఏళ్ల వయసులో ఇప్పుడు ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌ పరీక్షలు రాస్తున్నారు. ఎల్లాగౌడ్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌లో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి 2007లో రిటైర్‌ అయ్యారు. ఈ నెల 25 నుంచి ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాగా.. నిజామాబాద్‌ శివారులో బోర్గాం (పీ) కేంద్రంలో ఈయన పరీక్షలు రాస్తున్నారు. శనివారం తన కుమారుడు ఆయనను పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చారు.


గతేడాది పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యానని.. ఇప్పుడు ఇంటర్‌ పరీక్షలు రాస్తున్నట్లు ఎల్లా గౌడ్ చెప్పారు. చిన్నప్పుడు ఏడో తరగతి వరకు చదువుకున్నానని.. ఆ తర్వాత అనివార్య కారణాలతో మానేశానన్నారు. అనంతరం పెళ్లి, ఉద్యోగంతో పాటు కుటుంబ బాధ్యతలతో తీరిక ఉండేది కాదన్నారు. మనసులో చదువుకోవాలనే కోరిక బలంగా ఉండేదని.. అందుకే పదవీ విరమణ తర్వాత ఓపెన్‌ స్కూల్‌ విధానం ఎంచుకున్నట్లు తెలిపారు. ఎల్లాగౌడ్‌ ఇంట్లో రోజూ 3 నుంచి 4 గంటల పాటు పుస్తకాలు చదువుతారని ఆయన కుమారుడు పరశురాం తెలిపారు. మొత్తానికి ఈ పెద్దాయన ఎంతోమందికి ఆదర్శమంటున్నారు స్థానికులు


Latest News
 

ఓటు వేస్తూ సెల్ఫీ,,,ఓటరుపై కేసు నమోదు Mon, May 13, 2024, 09:17 PM
రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేత రఘునందన్ రావు Mon, May 13, 2024, 09:15 PM
మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు....రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి విమర్శ Mon, May 13, 2024, 09:14 PM
పోలింగ్ కేంద్రంలో ఆయన పేరు ప్రస్తావించిన కిషన్ రెడ్డి.. సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు Mon, May 13, 2024, 07:44 PM
పోలింగ్ అధికారులపై అనుచిత కామెంట్స్.. రాజాసింగ్‌పై మరో కేసు నమోదు Mon, May 13, 2024, 07:40 PM