ఎన్నికల కౌంటింగ్ వేళ.. ఉద్యోగులకు

byసూర్య | Sat, Dec 02, 2023, 08:17 PM

తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. ప్రభుత్వ ఉద్యోగులు ఎగిరిగంతేసే శుభవార్త వినిపించింది ఎన్నికల సంఘం. ప్రభుత్వ ఉద్యోగాలకు డీఏ విడుదల చేసేందుకు ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఉద్యోగులకు మొత్తంగా 3 డీఏలు పెండింగ్‌లో ఉండగా.. అందులో ఒకటి విడుదల చేసేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర సర్కార్ ఈసీని కోరింది. దీనిపై స్పందించిన ఈసీ.. డీఏ చెల్లింపులు ఎందుకు ఆలస్యమయ్యాయని, ఇప్పుడే ఎందుకు ఇవ్వాల్సి వస్తోందని ప్రభుత్వాన్ని ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈసీ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా ఉండటంతో.. డీఏ విడుదలకు అంగీకరించినట్టు తెలుస్తోంది.


డీఏ విడుదలపై ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా ఈసీని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాయి. ఇన్ని రోజులు పోలింగ్ ఉన్నందుకు గానూ.. ప్రభుత్వ పథకాలు, ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలను ఈసీ.. నిలిపేసిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పటికే రాష్ట్రంలో పోలింగ్‌ ముగిసినందున ఈసీ వారి విజ్ఞప్తికి అంగీకరించింది. మరోవైపు.. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 49 కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 113 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 14 టేబుళ్ల ద్వారా జరగనుంది. 500లకు పైగా పోలింగ్‌ కేంద్రాలున్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనుండగా.. తొలి ఫలితం 11 గంటలకు వెల్లడించనున్నట్టు అధికారులు చెప్తున్నారు.


Latest News
 

మియాపూర్‌ మెట్రో వద్ద చిరుత.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు Fri, Oct 18, 2024, 09:49 PM
ఆసుపత్రులలో అవసరమైన పరికరాల ప్రతిపాదనలు రూపొందించాలి Fri, Oct 18, 2024, 09:38 PM
మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Fri, Oct 18, 2024, 09:36 PM
తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందని విమర్శ Fri, Oct 18, 2024, 09:33 PM
హైదరాబాద్‌లో దారుణం.. వ్యభిచారం చేయమని కన్న కూతుర్ని ఒత్తిడి చేసిన తల్లి Fri, Oct 18, 2024, 09:33 PM