మియాపూర్‌ మెట్రో వద్ద చిరుత.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు

byసూర్య | Fri, Oct 18, 2024, 09:49 PM

జనావాసాల్లోకి చిరుతలు సంచరిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో తెగ సంచలనం అవుతున్నాయి. అయితే అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లోకి చిరుతలు, ఇతర క్రూర మృగాలు ప్రవేశించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ హైదరాబాద్ మహా నగరంలోకి చిరుత ప్రవేశించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అది కూడా మియాపూర్ లాంటి రద్దీ ప్రాంతంలో చిరుత సంచరించడం.. స్థానికుల కంట పడింది. దీంతో వారు చిరుత వెళ్తున్న దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో హైదరాబాద్ నగరవాసుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.


 శుక్రవారం సాయంత్రం మియాపూర్‌లో వెళ్తున్న చిరుతను అక్కడ ఉన్న వారు గుర్తించడం ప్రస్తుతం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మియాపూర్‌ మెట్రో స్టేషన్‌కు సమీపంలోనే ఆ చిరుత సంచరిస్తుండటంతో అక్కడి ప్రయాణికుల్లో తీవ్ర భయం నెలకొంది. అయితే చిరుత వెళ్లడం దూరం నుంచి గమనించిన స్థానికులు దాన్ని వీడియో తీసి వైరల్ చేస్తున్నారు. చిరుత సంచారంతో తీవ్ర భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అటవీ సిబ్బంది రంగంలోకి దిగి.. చిరుత ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.


సాయంత్రం చిరుత కనిపించడంతో.. అది ఎక్కడికి వెళ్లింది అని అధికారులు, స్థానికులు, పోలీసుల్లో కలవరం మొదలైంది. చీకటి సమయం కావడంతో ఆ చిరుత ఎక్కడికి వెళ్లిందోనని తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక చిరుత సంచారం గురించి విన్న మియాపూర్ వాసులు.. ఎప్పుడు, ఎక్కడ ఆ చిరుత కనిపిస్తుందోనని, దాడి చేస్తుందేమోననే భయంలో మునిగిపోయారు. ఇక ఏ రాత్రి పూట ఎక్కడ చిరుతను చూడాల్సివస్తుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీంతో రాత్రంతా చిరుత భయంతో జాగారం చేయాల్సి వస్తుందనే భయంలో మియాపూర్ వాసులు ఉన్నారు. అయితే ఆ చిరుత ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అటవీ అధికారులు, పోలీసులు ఆరా తీస్తున్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM