ఆసుపత్రులలో అవసరమైన పరికరాల ప్రతిపాదనలు రూపొందించాలి

byసూర్య | Fri, Oct 18, 2024, 09:38 PM

రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రులలో అవసరమైన పరికరాలకు ప్రతిపాదనలు రూపొందించాలని, వాటిని మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ,సబ్ సెంటర్లు, రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన పరికరాలు కల్పించాల్సిన సౌకర్యాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో నూతనంగా మంజూరైన 18 ఆరోగ్య సబ్ సెంటర్ల నిర్మాణ పనులు ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఈఈ పంచాయతీరాజ్ అధికారిని ఆదేశించారు. జిల్లాలో ఉన్న పి.హెచ్.సి లు, సబ్ సెంటర్ల పరిధిలో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన పరికరాలు, సామాగ్రి, మౌలిక వసతుల ప్రతిపాదనలు తయారు చేసి నివేదికను సమర్పించాలని, అవసరమైన నిధులను కేటాయించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వైద్యారోగ్య శాఖ అధికారికి సూచించారు. మన జిల్లాలో ఉన్న 18 పి.హెచ్.సి లకు గాను ఇప్పటి వరకు 8  పి.హెచ్.సి లు ఎన్.క్యూ.ఏ సర్టిఫికేషన్ పొందాయని, మిగిలిన పి.హెచ్.సి లు ఎన్.క్యూ.ఏ సర్టిఫికేషన్ పొందే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని, అదే విధంగా 3 ఆరోగ్య సబ్ సెంటర్ల ఉన్న ఎన్.క్యూ.ఏ సర్టిఫికేషన్ మరో 25 ఆరోగ్య సబ్ సెంటర్లకు వచ్చేలా చూడాలని, దీనికి పాటించాల్సిన అంశాలు, అవసరమైన సామాగ్రి, కల్పించాల్సిన మౌలిక సదుపాయాల పై సంపూర్ణ సహకారం అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉన్న  కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఉన్న సామాగ్రి,ఏక్కడ అవసరమైన  వైద్య పరికరాల పై కూడా నివేదిక తయారు చేయాలని, క్రమ పద్ధతిలో మంజూరు చేసి అవసరమైన పరికరాలు ఆసుపత్రిలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, ఈఈ పంచాయతీరాజ్ గిరీష్ బాబు, ప్రోగ్రాం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM