దిశ మార్చే కీలక నిర్ణయం.. ఆ ఒక్క మార్పుతో కమలం చక్రం తిప్పటం ఖాయం

byసూర్య | Sat, Dec 02, 2023, 09:22 PM

కేంద్రంలో రెండు సార్లు ప్రభుత్వానికి ఏర్పరిచిన బీజేపీ.. తెలంగాణలో మాత్రం సర్కారు ఏర్పాటు చేయకపోయినా.. కనీసం ప్రభావం చూపలేకపోతోంది. నార్త్‌లో బీజేపీ హవా గట్టిగానే వీస్తున్నా.. సౌత్‌లో మాత్రం నామమాత్రంగానే ఉంది. అయితే.. తెలంగాణ నుంచే సౌత్‌లో తన సత్తా చూపెట్టాలని కమలం పార్టీ ఎంతగానో ట్రై చేస్తుంది. ప్రధాని మోదీతో పాటు కేబినెట్‌ మొత్తం తెలంగాణకు క్యూ కట్టినా పని జరగట్లేదు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అంతో ఇంతో ఆదరణ రాగా.. ఆయనను తీసేయటంతో ఉన్నది కూడా పోయినట్టు కనిపిస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కమళ దళం మొత్తం వచ్చి ప్రచారం చేసినా.. పెద్దగా ఫలితం మాత్రం కనిపించలేదనే చెప్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. కేవలం 5 నుంచి 10 సీట్లే వచ్చే అవకాశం ఉందని అన్ని సర్వేలు చెప్పటంతో.. తెలంగాణలో బీజేపీ దశ తిరిగేందుకు రాష్ట్ర నాయకత్వం కీలక మార్పుకు తెరలేపింది.


కీలక మార్పు అంటే.. రాష్ట్ర అధ్యక్షున్ని మళ్లీ మార్చుతున్నారా.. లేదా వేరే రాష్ట్రంలోకి పెద్ద నాయకున్ని ఈ రాష్ట్ర ఇంఛార్జ్‌గా నియమిస్తున్నారా.. లాంటివి కాదండోయ్.. తెలంగాణలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కొన్ని వాస్తు సంబంధిత మార్పులు చేపట్టింది. నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం రాకపోకల ద్వారాన్ని మార్చేందుకు బీజేపీ నిర్ణయించింది. మొన్నటి వరకు తూర్పు ద్వారం నుంచి రాకపోకలు సాగించగా.. ఇప్పుడు వాస్తు ప్రకారం ఆ ద్వారాన్ని మూసేయ్యాలని పండితులు సూచించగా.. అందుకు బీజేపీ అగ్ర నేతలు ఒప్పుకున్నారు. తూర్పు ద్వారానికి బదులు ఉత్తర ద్వారం నుంచి రాకపోకలు జరపేందుకు నిర్ణయించారు. అయితే.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య నెక్ టూ నెట్ ఫైట్ నెలకొంది. హంగ్ వచ్చే అవకాశం ఉందని చాలా సర్వేలు చెప్తున్నాయి. ఈ క్రమంలో.. బీజేపీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నది వాదన. పోలింగ్ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు తూర్పు ద్వారం మూసేయాలని.. దాని వల్ల బీజేపీకి కలిసొచ్చి చక్రం తిప్పుతుందని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. ఇప్పటికే పోలింగ్ ముగియగా.. ఫలితాలు ప్రకటించే వరకు ఉత్తర ద్వారం నుంచే నడుస్తున్నారు.


ఇలా చేస్తే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని వాస్తు పండితులు సూచించినట్టు సమాచారం. మరి బీజేపీ చేస్తున్న ఈ వాస్తు మార్పులు ఆ పార్టీకి కలసొచ్చి.. చక్రం తిప్పే అవకాశం ఇస్తుందేమో తెలియాలంటే.. డిసెంబర్ మూడో తేదీ సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.గతంలో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఇలాంటి సెంటిమెంట్‌నే నమ్మినట్టు సమాచారం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రెండు ద్వారాల నుంచి రాకపోకలు జరిగేవని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఇలా చేయగా.. బీజేపీ మంచి సీట్లు వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు కూడా కమలం పార్టీకి చక్రం తిప్పే అవకాశం వస్తుందేమో చూడాలి.


Latest News
 

అదానీ ఫౌండేషన్ తరఫున ఈ మొత్తాన్ని అందించిన అదానీ గ్రూప్ అధినేత Fri, Oct 18, 2024, 07:56 PM
రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత రావాలని మంత్రులే చూస్తున్నారన్న సంజయ్ Fri, Oct 18, 2024, 07:52 PM
మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ Fri, Oct 18, 2024, 06:50 PM
మూసీ నది ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కౌంటర్‌ ఛాలెంజ్‌ Fri, Oct 18, 2024, 06:40 PM
జీవో 29ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ Fri, Oct 18, 2024, 05:12 PM