బండి సంజయ్‌తో ఓకే.. కేటీఆర్‌తో మాత్రం వద్దు'.. రేవంత్ రెడ్డి

byసూర్య | Sat, Dec 02, 2023, 08:08 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. నవంబర్ 30న 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగ్గా.. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. రేపు (డిసెంబర్ 3) ఫలితాలు వెల్లడికానుండగా.. ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ వైపు మెుగ్గుచూపాయి. తెలంగాణ ప్రజలు ఈసారి హస్తానికి పట్టం కట్టనున్నారని ఎగ్జిట్ పోల్ సర్వేల్లో వెల్లడైంది. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి నేతలు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆయన్ను అభినందిస్తున్నారు.


ఇక తామే అధికారంలోకి రాబోతున్నామని రేవంత్ రెడ్డి కూడా పలు మీడియా ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. మంత్రి కేటీఆర్‌తో తనను పోల్చటంపై రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను కష్టపడి పైకి వచ్చానని.. కిందిస్థాయి నుంచి ప్రజలతో మమేకమై ఈ స్థాయికి వచ్చినట్లు చెప్పారు. కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్ కోటా అని.. ఆయన తన తండ్రి కేసీఆర్ గుర్తింపుతో రాజకీయాల్లో కొనసాగుతున్నారని అన్నారు. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ ఈ కామెంట్స్ చేశారు.


'నాది మెరిట్ కోటా. కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్ కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటా. కేటీఆర్‌తో నన్ను పోల్చకండి. ఆయన తండ్రి కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు కాబట్టి కొడుకు కేటీఆర్‌కు పార్టీలో కీలక స్థానం ఇచ్చారు. మంత్రిని, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేశారు. ఆయనతో నన్నెల పోలుస్తారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పోల్చితే ఒకే.. నాకు ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే అతడు గ్రౌండ్ లెవల్ నుంచి పైకి వచ్చాడు. అసలు తెలంగాణతో కేటీఆర్‌కు ఏం సంబంధం. కేటీఆర్ ఎవరంటే.. కేసీఆర్‌ కుమారుడని చెబుతారు. మా పోరాటం కేటీఆర్ తండ్రి కేసీఆర్‌తోని. ప్రస్తుతం రాజకీయంగా కాంగ్రెస్ పోరాటం కేసీఆర్‌తోని. బీజేపీ పోరాటమమైనా కేసీఆర్‌తోనే. కేటీఆర్‌తో నాకు పోలిక వద్దు.' అని రేవంత్ రెడ్డి అన్నారు.


అధికారం, కాంగ్రెస్ ఈ రెండింట్లో మీ మదిలో ఏం ఉందని సదరు మీడియా ప్రతినిధి ప్రశ్నంచగా.. జనం ఉన్నారని రేవంత్ బదులిచ్చారు. తనకు అధికారం ముఖ్యం కాదని ప్రజలే ముఖ్యమని చెప్పారు. గతంలో వైఎస్సాఆర్, కేసీఆర్ ఆఫర్స్ ఇస్తే తాను తిరస్కరించినట్లు చెప్పారు. తాను ఇండిపెండెంట్‌గా జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా గెలిచానని.. ఆ తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా, మరోసారి ఎంపీగా విజయం సాధించినట్లు చెప్పారు. స్వయంకృషితో కష్టపడి తాను పైకి వచ్చానని రేవంత్ వెల్లడించారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM