కేసీఆర్ కాదు కాబోయే సీఎం కేటీఆర్ .. వేణుస్వామి జ్యోతిష్యం

byసూర్య | Sat, Dec 02, 2023, 07:12 PM

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. రేపు ఫలితాలు విడుదల కానుండగా.. ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎవరు సీఎం కుర్చీ దక్కించుకుంటారనేది ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. ఇదే విషయమై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగులు కూడా జరుగుతున్నాయి. అయితే సీఎం ఎవరనే విషయంపై ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సీఎం ఎవరనేది తేల్చి చెప్పారు.


2023లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే.. కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేరని ఆయన వెల్లడించారు. ఈసారి డైరెక్టుగా కేటీఆర్ సీఎం అవుతారని చెప్పారు. కేటీఆర్ జాతకం ప్రకారం ఆయనకు సీఎం యోగం ఉందని అన్నారు. అయితే 2023లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే అధి సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం కావాలంటే బలమైన గ్రహాలు అనుగ్రహించాలని చెప్పారు. ఎమ్మెల్యే స్థాయి వేరు, మంత్రి స్థాయి వేరని.. ముఖ్యమంత్రి కావాలంటే గ్రహాలు అనుకూలించాలని అన్నారు. కేసీఆర్‌కు చంద్రమంగళ యోగం ఉందని.. అందుకే ఆయన సీఎం అయ్యి పదేళ్లు అధికారంలో ఉన్నారన్నారు.


ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఎవరు సీఎం అవుతారనే దానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. వారి వారి జాతకాలను బట్టి పదవి యోగం ఉంటుందని అన్నారు. అప్పుడు జాతకాలను బట్టి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇలా ఆ పార్టీలో ఎవరో ఒకరు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందని అన్నారు. జాతకాలను బట్టి కొన్ని సార్లు శత్రువుల బలహీనతలే మన బలాలుగా మారుతయాన్నారు. అప్పట్లో ఆయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి. ఆయన కచ్చితంగా కేటీఆరే సీఎం అవుతారని చెప్పకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. రేపటి ఫలితాలతో నేతల జాతకాలతో పాటు వేణుస్వామి జాతకం కూడా బయటపడుతుందని కామెంట్లు పెడుతున్నారు.


సినీ రంగంలో, రాజకీయ రంగంలో సెలబ్రిటీల గురించి, వారి జాతకాల గురించి చెబుతూ వేణు స్వామి కూడా ఓ సెలబ్రిటీ అయిపోయారు. జాతకంలో ఉన్న దోషాలను గుర్తించి ప్రత్యేకంగా పలువురు సినీ,రాజకీయ సెలబ్రెటీలు ఆయనచేత పూజలు చేయించుకుంటున్నారు. సమంత, నాగచైతన్య వివాహం జరిగిన తర్వాత వారిద్దరూ ఎక్కువ రోజులు కలిసివుండరని.. విడిపోతారని అప్పట్లో వేణుస్వామి చెప్పారు. అయితే అప్పుడెవరూ ఆయన మాటలకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎప్పుడైతే వీరిద్దరూ విడిపోయారో అప్పటి నుంచి వేణుస్వామికి డిమాండ్ పెరిగింది.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM