సీఎం కేసీఆర్‌కు వైఎస్ షర్మిల గిఫ్ట్

byసూర్య | Sat, Dec 02, 2023, 01:51 PM

తెలంగాణలో రేపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రెడ్డి కేసీఆర్‌కి "బై బై కేసీఆర్" అంటూ సూట్ కేస్ గిఫ్ట్పంపారు. సీఎం కేసీఆర్ కు సూట్‌ కేసును గిఫ్ట్‌గా పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. "కాంగ్రెస్ ను ఓడించండం అంత సులువైన పని. కానీ కేసీఆర్ ను ఓడించాలనేది మా ఉద్దేశ్యం. అందుకే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాము. తెలంగాణ ప్రజలు KCR కు బైబై చెప్పారు."అని ఆమె వ్యాఖ్యానించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈసారి 1.80 లక్షల పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు 8. 30 గంటల నుంచి జరుగుతుంది. అప్పటికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకపోతే సమాంతరంగా రెండు కౌంటింగ్ ప్రక్రియలు నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM