రేపే కౌంటింగ్..అభ్యర్థుల్లో టెన్షన్

byసూర్య | Sat, Dec 02, 2023, 01:39 PM

అసెంబ్లీ ఎన్నికల తాలూకా కౌంటింగ్ ఆదివారం జరగనుంది. నెల రోజుల పాటు క్షణం తీరిక లేకుండా ప్రచారం చేసిన అభ్యర్థుల భావిత్వం..ప్రస్తుతం ఓటింగ్ మిషన్ లో ఉంది. ఆదివారం ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ మొదలుకాబోతుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికార పార్టీ కి వ్యతిరేకంగా రావడంతో అధికార పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం అవుతాయా..? లేదా ..? అనేదానిపై జిల్లా వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ఈ ఫలితాలపై అభ్యర్థులే కాదు ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈసారి 1.80 లక్షల పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు 8. 30 గంటల నుంచి జరుగుతుంది. అప్పటికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకపోతే సమాంతరంగా రెండు కౌంటింగ్ ప్రక్రియలు నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 


Latest News
 

ఏఐ అంటే రేవంత్ రెడ్డి ఎనుముల ఇంటెలిజెన్స్ : కేటీఆర్ Mon, Oct 21, 2024, 10:47 AM
తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య Mon, Oct 21, 2024, 10:22 AM
మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM