3న ప్రమాణ స్వీకార తేదీని ప్రకటిస్తా: సీఎం కేసీఆర్

byసూర్య | Sat, Dec 02, 2023, 01:32 PM

పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు భరోసా కల్పిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి వస్తున్నామన్నారు. ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులతో పాటు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ కేకే, పలువురు సీనియర్‌ నేతలతో సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లాల నేతలతో పోలింగ్ పై సమీక్షిస్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో నల్గొండ జిల్లాకు చెందిన ఉమ్మడి నేతలు మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు హైదరాబాద్, పాలమూరు ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌ను కలిశారు.
నియోజకవర్గాల వారీగా వివరాలు అందించారు. సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ పార్టీకి ఏ నియోజకవర్గంలో మార్జిన్ వస్తుంది? సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ నమ్మవద్దని... పార్టీ ఫీడ్ బ్యాక్ ఆధారంగానే బీఆర్ ఎస్ గెలుస్తుందని నేతలకు కేసీఆర్ సూచించారు. గతంతో పోలిస్తే కొన్ని సీట్లు తగ్గుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దక్షిణ భారతదేశంలోనే బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధిస్తుందని కేసీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 3న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ప్రమాణస్వీకార తేదీని ప్రకటిస్తామని కేసీఆర్ నేతలకు చెప్పినట్లు సమాచారం. బీఆర్ ఎస్ కు అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయని, అసహనానికి లోనుకాకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నేతల సమావేశంలో అధినేత చెప్పినట్లు తెలిసింది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈసారి 1.80 లక్షల పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు 8. 30 గంటల నుంచి జరుగుతుంది. అప్పటికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకపోతే సమాంతరంగా రెండు కౌంటింగ్ ప్రక్రియలు నిర్వహిస్తారు.


Latest News
 

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం Mon, Oct 21, 2024, 01:05 PM
పోలీసు అమరవీరుల త్యాగనిరతి చిరస్మరణీయం Mon, Oct 21, 2024, 01:02 PM
ఎంపీకి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే Mon, Oct 21, 2024, 01:01 PM
కేటీఆర్ నివాసం వ‌ద్ద పోలీస్ బందోబ‌స్తు.. Mon, Oct 21, 2024, 12:54 PM
నేటి నుంచే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు Mon, Oct 21, 2024, 12:20 PM