ఎగ్జిట్ పోల్స్.. ఫలితాలు పక్కాగా?

byసూర్య | Sat, Dec 02, 2023, 10:37 AM

అసెంబ్లీ ఎన్నిక‌ల ఓటింగ్ ప్ర‌క్రియ ముగిసి, ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు కూడా వ‌చ్చేశాయి. ఇక రేపు ఉద‌యం 08:00 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు విజ‌యం సాధిస్తార‌నే అంశంపై స‌ర్వత్రా చ‌ర్చ జ‌రుగుతోంది. అలాగే పందేల జోరు ఊపందుకుంది. రూ.1000 నుంచి రూ.లక్షల్లో బెట్టింగ్‌ వేస్తున్నారు. అంతేకాకుండా తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే దావత్‌ చేస్తాం.. టూర్‌కు తీసుకెళ్తామంటూ పందేలు కాస్తున్నారు.
ఎగ్జిట్‌ పోల్స్ ఆధారంగా.. ఎవ‌రు విజ‌యం సాధిస్తార‌నే అంశంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతుంది. అస‌లు ఎగ్జిట్‌ పోల్స్‌లో జరిగేది ఏంటంటే.. ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో కనీసం రెండున్నర లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. కానీ, ఓటర్‌ సర్వే సంస్థలు మాత్రం.. కేవలం ఒక్క శాతం, రెండు శాతం ఓట‌ర్ల అభిప్రాయం మాత్రమే తీసుకుంటాయి. అలాంటప్పుడు.. ఫలితం పక్కాగా వస్తుందా?


Latest News
 

మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ Wed, Oct 23, 2024, 07:53 PM
మహారాష్ట్ర అభ్యర్థికి బీఫామ్ అందజేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ Wed, Oct 23, 2024, 07:46 PM
చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేసిన కార్పొరేటర్ Wed, Oct 23, 2024, 07:45 PM
గవర్నర్ పర్యటన పై మంత్రి ఉత్తమ్ హర్షం Wed, Oct 23, 2024, 07:43 PM
మైనర్ బాలికపై పోలీస్ ఇన్స్‌పెక్టర్ అత్యాచారయత్నం Wed, Oct 23, 2024, 07:42 PM