తలసాని హ్యాట్రిక్ కొడుతున్నారా?

byసూర్య | Sat, Dec 02, 2023, 10:45 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 49 కేంద్రాలను ఎంపిక చేశామ‌ని సీఈవో వికాస్‌రాజ్ వెల్ల‌డించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను అమలు చేస్తున్నామ‌ని తెలిపారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను, అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతామ‌ని పేర్కొన్నారు.
హైదరాబాద్ పరిధిలోని సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నుంచి పోటీలో నిలబడిన కోట నీలిమకు కేడర్ సహకరించలేదట. బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్రెడ్డి ప్రభావం చెప్పలేదని సమాచారం. 2014లో 27, 461, 2018లో 30, 651 ఓట్ల తేడాతో తలసాని గెలవగా, ఈసారి మెజార్టీ తగ్గొచ్చని అంచనా.


Latest News
 

రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ ప్లస్ అదానీ Wed, Oct 23, 2024, 04:08 PM
జీవన్ రెడ్డి వంటి నేతనే ఫిరాయింపులు పార్టీ వ్యతిరేకమని చెప్పారన్న కేటీఆర్ Wed, Oct 23, 2024, 04:06 PM
లీగల్ నోటీసులతో బెదిరించాలని చూస్తే భయపడేవారు లేరన్న సంజయ్ Wed, Oct 23, 2024, 04:03 PM
బిసి రాజ్యాధికార సమితి ఏర్పాటుకు సమరభేరి Wed, Oct 23, 2024, 04:01 PM
కొండా సురేఖ తరఫున రిప్లై దాఖలు చేసిన న్యాయవాది గుర్మీత్ సింగ్ Wed, Oct 23, 2024, 04:00 PM