చెల్లి పెళ్లికి డబ్బులు లేక అన్న ఆత్మహత్య,,,,సూసైడ్ లెటర్ రాసి ప్రాణాలు తీసుకున్న యువకుడు

byసూర్య | Tue, Nov 21, 2023, 08:35 PM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ అన్న చెళ్లి పెళ్లి చేయలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ వైపు పేదరికం.. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఇవి తట్టుకోలేని యువకుడు సూసైడ్ నోట్ రాసి తనువు చాలించాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎనుగల్ గ్రామానికి చెందిన గసికంటి శంకరయ్య, సత్తవ్వది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గానీ.. డొక్కాడని పరిస్థితి. వారికి కుమారుడు ప్రమోద్(25), కూతురు ఉన్నారు.


ప్రమోద్ ఉపాధి కోసం మూడేళ్ల క్రితం అప్పు చేసి మరీ గల్ఫ్ వెళ్లాడు. అక్కడి పరిస్థితులను తట్టుకుని పని చేయలేకపోయాడు. చేసిన పనికి జీతం ఇవ్వకపోవడంతో ఏడాది తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి గ్రామంలోనే ఉంటూ కూలి పనులకు వెళ్తున్నాడు. ఆదివారం రాత్రి గ్రామంలో పత్తి లోడు ఎత్తి ఇంటికి చేరుకున్నాడు. కుటుంబంతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున తల్లి సత్తవ్వ లేచి చూసేసరికి ప్రమోద్ఇంట్లో దూలానికి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. అది చూసి షాక్‌కు గురైన తల్లి.. ఒక్కసారిగా బోరున విలపించింది. గమనించిన చుట్టుపక్కల వారు ప్రమోద్‌ను కిందకు దించారు. అయితే అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు.


'నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకనే చనిపోతున్నాను. చెల్లిని బాగా చూసుకోవాలి.' అని ప్రమోద్ సూసైడ్ నోట్ రాశాడు. ప్రమోద్ చెల్లెలు బీటెక్ పూర్తిచేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగం చేస్తోంది. అయితే ఆమెకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయటానికి డబ్బు లేకపోవటం, గల్ఫ్ వెళ్లేందుకు చేసిన అప్పులు తీర్చటం భారమై.. ఆర్థిక ఇబ్బందులతో తమ కుమారుడు మృతి చెందినట్లు తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


Latest News
 

తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వ పథకాల ప్రకటనలు,,,,తక్షణం నిలిపివేయాలని ఈసీ ఆదేశం Tue, Nov 28, 2023, 07:17 PM
మహేబాబుకు నేను అభిమానిని,,,ఆయన సినిమా చూసే రాజకీయాల్లోకి వచ్చా Tue, Nov 28, 2023, 07:10 PM
ఓటు ఎలా వేయాలో తెలుసా?.. కొత్త ఓటర్లకు సూచనలు Tue, Nov 28, 2023, 06:50 PM
ఎన్నికల వేళ విద్యార్థులకు 2 రోజుల సెలవులు,,,ఉద్యోగులకు పెయిడ్ హాలిడే Tue, Nov 28, 2023, 06:45 PM
మీ దగ్గరికి రాలేకపోవచ్చు, కానీ మీరంతా నా మనసులో ఉంటారు.. సోనియమ్మ భావోద్వేగ సందేశం Tue, Nov 28, 2023, 06:40 PM