మజ్లిస్ కంచుకోటలో కాషాయ జెండా.. పాతబస్తీలో హ్యాట్రిక్ కొట్టిన ఒకే ఒక్క హిందూ నేత

byసూర్య | Tue, Nov 21, 2023, 08:29 PM

హైదరాబాద్ పాతబస్తీ ఎంఐఎం పార్టీకి కంచుకోట. అక్కడ మస్లిం ఓటు బ్యాంకే అధికం. గతకొన్ని దశాబ్దాలుగా ఏ పార్టీ పోటీ చేసిన ఓటమి ఖాయం. పాతబస్తీలోని ముఖ్యమైన మలక్‌పేట, కార్వాన్, చార్మినార్, చంద్రాయణగుట్ట, యాకత్ పూరా, బహదూర్ పురా, నాంపల్లి సెగ్మంట్లలో మజ్లిస్ పార్టీదే ఆదిపత్యం. కనీసం మేనిఫెస్టో కూడా లేకుండా ఆ పార్టీ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. పాతబస్తీ వాసులు వారికే పట్టం కడుతున్నారు. అయితే మస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉన్న పాతబస్తీలో ఓ హిందూనేత హ్యాట్రిక్ విజయాలు సాధించారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి మజ్లిస్ కంచుకోటలో కాషాయ జెండాను రెపరెపలాడించారు. ఆయనే బద్దం బాల్ రెడ్డి. విద్యార్థి దశలోనే ఉద్యమాల్లో పనిచేసిన బాల్ రెడ్డి.. ఆ తర్వాత జనసంఘ్‌లో చేరాడు. 1977లో జనసంఘ్ నేతలతో పాటు జనతాపార్టీలో చేరాడు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగాడు. 1985 నుంచి 1994 వరకు 3 సార్లు కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1985లో మజ్లిస్ అభ్యర్థి విరాసత్‌ రసూల్‌ఖాన్‌పై 9,777 ఓట్ల మెజార్టీ, 1989లో ఆకర్‌ ఆగాపై 3,066 ఓట్ల మెజార్టీ, 1994లో సయ్యద్‌ సజ్జాద్‌పై 13,293 ఓట్ల మెజార్టీతో విజయ దుంధుబి మోగించారు. ఇలా హ్యాట్రిక్ కొట్టిన ఆయన్ను.. అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ముద్దుగా 'కర్వాన్ టైగర్‌', 'గోల్కోండ సింహం' అని పిలిచుకునేవారు.


1991,1998, 1999లో హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గట్టిపోటినిచ్చారు. స్వల్పతేడాతో ఓటమి పాలై.. రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 1999, 2004, 2009, 2014 కార్వాన్‌ నుంచి 2018లో రాజేంద్రనగర్‌ నుంచి ఎమ్మెల్యేగా ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేసినా.. ఆయనకు విజయం వరించచలేదు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ కేర్‌ ఆస్పత్రిలో 2019లో తుదిశ్వాస విడిచారు.


బాల్ రెడ్డి తర్వాత మజ్లిస్ అభ్యర్థులు తప్ప మరెవరూ పాతబస్తీ నుంచి హ్యాట్రిక్ సాధించలేదు. ప్రస్తుతం ఆ అకాశం బీజేపీ నుంచే పోటీ చేస్తున్న రాజాసింగ్‌కు వచ్చింది. రాజాసింగ్ 2014, 2018 నుంచి గోషామహల్ ఎమ్మల్యేగా గెలుపొందారు. ఈ సెంగ్మెంట్ పాతబస్తీ పరిధిలోకే వస్తుంది. మరోసారి ఇక్కడ ఆయన విజయం సాధిస్తే బాల్ రెడ్డి తర్వాత హ్యాట్రిక్ కొట్టిన వ్యక్తిగా నిలుస్తారు. అయితే ఇక్కడ మజ్లిస్ పార్టీ తన అభ్యర్థిని నిలపలేదు. ఆ పార్టీకి ఏడు సిట్టింగ్ స్థానాలు ఉండగా.. ఈసారి అదనంగా జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నుంచి మజ్లిస్ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM