పోలింగ్ నేపథ్యంలో తెలంగాణలో మూడ్రోజుల పాటు వైన్ షాపులు బంద్

byసూర్య | Tue, Nov 21, 2023, 08:25 PM

తెలంగాణలోని మద్యం ప్రియులకు నిజంగా ఇది బ్యాడ్‌న్యూస్. ఎందుకంటే మూడో రోజులు రాష్ట్రంలో వైన్స్, బార్లు బంద్ చేయనున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 28 నుంచి 30 వరకు మూడ్రోజుల పాటు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 30న పోలింగ్ జరనుండగా.. రెండ్రోజుల ముందే మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు లైసెన్స్‌దారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


తెలంగాణలో పోలింగ్ దగ్గరపడుతుండటంతో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఓటర్లకు పంచేందుకు భారీగా నగదు, మద్యాన్ని కొందరు అభ్యర్థులు రెడీ చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే అవి చేరాల్సిన చోటుకు చేరిపోయాయని..ఎన్నికలకు ముందురోజు ఓటర్లకు పంచేందుకు అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. గత ఎన్నికలు, ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో మద్యం ఏరులై పారింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం.. ఈసారి ముందుగానే వైన్స్, బార్లు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.


మరోవైపు తెలంగాణ పోలీసులు, కేంద్ర బలగాలు, ఎక్సైజ్ అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మద్యం అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు రూ. 100 కోట్లకు పైగా విలువైన మద్యం పట్టుబడింది. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో పోలీసులు నిఘాను పెంచారు.


Latest News
 

గెలిపిస్తే విజయయాత్ర.. లేకపోతే కుటుంబంతో సహా శవయాత్ర: పాడి కౌశిక్ రెడ్డి Tue, Nov 28, 2023, 06:25 PM
24 ఏళ్లుగా తెలంగాణే ఆశగా, శ్వాసగా బతుకున్నా.. చివరి ప్రచార సభలో కేసీఆర్ Tue, Nov 28, 2023, 06:21 PM
24 ఏళ్లుగా తెలంగాణ ఆశగా. శ్వాసగా బతుకుతున్నా: కేసీఆర్ Tue, Nov 28, 2023, 03:47 PM
కేసీఆర్‌ పేదలను కొట్టి పెద్దలకు ఇస్తున్నారు: ఈటల Tue, Nov 28, 2023, 03:05 PM
వారికి కూడా పట్టాలు ఇస్తాం: సీఎం కేసీఆర్ Tue, Nov 28, 2023, 03:01 PM