నాలుగేళ్లలో అమీన్పూర్ రూపు రేఖలు మార్చాం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

byసూర్య | Tue, Nov 21, 2023, 08:23 PM

ప్రజలకు పారదర్శక పాలనను అందిస్తూ, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించిన బిఆర్ఎస్ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు బలపరచాలని పటాన్చెరు శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సుపరిపాలన అందించాలన్న లక్ష్యంతో అమీన్పూర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా చేయడంతో పాటు నాలుగేళ్లలో 150 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించి 120 కోట్ల రూపాయలతో ఐదు రిజర్వాయర్లను నిర్మించామని తెలిపారు. అవినీతికి అరాచకానికి చిరునామాగా నిలిచే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో స్థానం లేదన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా మేనిఫెస్టోను అమలు చేసిందా అని ప్రశ్నించారు.  కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ బి ఆర్ ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా కాలనీలలో నిర్వహించిన రోడ్డు షోకు ప్రజల నుండి అపూర్వస్పందన లభించింది. ప్రజల స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొని ఎమ్మెల్యే జిఎంఆర్ కు సంపూర్ణ మద్దతు పలికారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, పార్టీ అధ్యక్షులు బాల్ రెడ్డి, కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
వి సత్యనారాయణ .అమీన్ పూర్ మండల సూర్య రిపోర్టర్


Latest News
 

ఓటు ఎలా వేయాలో తెలుసా?.. కొత్త ఓటర్లకు సూచనలు Tue, Nov 28, 2023, 06:50 PM
ఎన్నికల వేళ విద్యార్థులకు 2 రోజుల సెలవులు,,,ఉద్యోగులకు పెయిడ్ హాలిడే Tue, Nov 28, 2023, 06:45 PM
మీ దగ్గరికి రాలేకపోవచ్చు, కానీ మీరంతా నా మనసులో ఉంటారు.. సోనియమ్మ భావోద్వేగ సందేశం Tue, Nov 28, 2023, 06:40 PM
మూగబోయిన మైకులు.. ప్రచారానికి తెర, అమల్లోకి ఆంక్షలు Tue, Nov 28, 2023, 06:34 PM
గెలిపిస్తే విజయయాత్ర.. లేకపోతే కుటుంబంతో సహా శవయాత్ర: పాడి కౌశిక్ రెడ్డి Tue, Nov 28, 2023, 06:25 PM