కేసీఆర్ తాంత్రిక పూజలు చేయిస్తున్నారు,,,నిమ్మకాయలు ఇస్తే తీసుకోకండి

byసూర్య | Mon, Sep 25, 2023, 07:35 PM

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కుతోంది. అన్ని పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా.. సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆరోపించారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా కరీంనగర్‌లో మొక్కలు నాటి బీజేపీ ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మట్లాడిన సంజయ్.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇతర పార్టీలోని ముఖ్యనేతలను, సొంత పార్టీలో తన మాట విననివారిని నాశనం చేసేందుకు కేసీఆర్ తాంత్రికపూజలు చేయిస్తున్నారన్నారు. తాంత్రిక పూజల్లో కేసీఆర్, ఆయన కుటుంబం ఆరితేరిందన్న బండి సంజయ్... బీఆర్ఎస్ నేతలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు., సీఎం కేసీఆర్‌తో చేయి కలిపితే జీవితాలు నాశనమవుతాయని హెచ్చరించారు. కేసీఆర్ నిమ్మకాయ ఇచ్చినా, బొట్టు పెట్టినా, కంకణం కట్టినా కట్టుకోవద్దని బీఆర్ఎస్ పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు సూచించారు. ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదని మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు, పెద్ద మనుషుల ఆరోగ్యం జాగ్రత్త అని అన్నారు.


కేసీఆర్ ఇతరుల నాశనం కోరుకుంటున్నారని... డబ్బులతో రాజకీయం చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్‌లో కేసీఆర్‌ కోవర్టులు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్‌లో కులాల కొట్లాటను కేసీఆరే పెట్టిస్తున్నారని ఆరోపించారు. అక్కడ ఎవరు గెలిచినా.. చివరకు కేసీఆర్ దగ్గరికే వెళ్తారని చెప్పారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసినందుకు కేసీఆర్‌ను యువత క్షమించదని అన్నారు. కేసీఆర్ ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని పూజలు చేసినా.. తిరిగి అధికారంలోకి రావటం సాధ్యం కాదని సంజయ్ వ్యాఖ్యనించారు.


అయితే సంజయ్ ఈ తరహా వ్యాఖ్యలు చేయటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఫాంహౌజ్, ప్రగతి భవన్‌లో కేసీఆర్ తాంత్రిక పూజలు చేయిస్తున్నారన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు నాశనం కావాలనే ఉద్దేశంతో ఈ పూజలు జరుపుతున్నారన్నారు. ఆయన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆయన మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM