ఈ ఎన్నికల్లోనే మీ సీటు త్యాగం చేసి ఒక మహిళకు ఇవ్వండి.... వై.ఎస్. షర్మిల

byసూర్య | Wed, Sep 20, 2023, 08:32 PM

మంత్రి కేటీార్ కు  వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సవాల్ విసిరారు. మహిళా రిజర్వేషన్లతో తన సీటు కోల్పోయినా సిద్ధమే అని చెప్పే కేటీఆర్ గారూ.. బిల్లు అమలయ్యేదాక ఎదురుచూడటం ఎందుకు? ఈ ఎన్నికల్లోనే మీ సీటు త్యాగం చేసి ఒక మహిళకు ఇవ్వండని షర్మిల ఎద్దేవా చేశారు. మీ సీటును త్యాగం చేస్తే మిమ్మల్ని అడ్డుకునేదెవరని ప్రశ్నించారు. నిజంగా మహిళల రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే.. మీరు డబ్బాలు కొట్టుకుంటున్నట్టు మహిళా బిల్లు మీ పోరాట ఫలితమే అయితే.. ఈ ఎన్నికల్లోనే మహిళలకు పెద్దపీట వేయండి, మీ సీటు మహిళకు ఇవ్వండని అన్నారు. మీ పార్టీ ప్రకటించిన సీట్లలో మహిళలకు 33 శాతం తక్షణమే అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన రాష్ట్రంగా తెలంగాణను ఆదర్శంగా నిలపాలని అన్నారు. 


మహిళలను దారుణంగా అవమానించిన మీరే ఈరోజు మహిళల గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని షర్మిల విమర్శించారు. నిరుద్యోగుల కోసం మేం దీక్షలు చేస్తే వ్రతాలంటూ ఎద్దేవా చేసింది మీరేనని... మహిళా మంత్రులు లేకుండా చేసింది మీరేనని... మహిళా కమిషన్ ఉందన్న సంగతే మర్చిపోయారని దుయ్యబట్టారు. శ్రీకాంతాచారి తల్లి ఓడిపోతే ఆమెకు ఏ పదవి ఇవ్వలేదని... కానీ, మీ చెల్లి కవితమ్మ ఓడిపోతే, కేసీఆర్ బిడ్డ కాబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు. మీకున్నది మహిళల మీద ప్రేమ కాదు.. మీ కుటుంబం మీద ప్రేమ.. మీకు సామాన్య ప్రజల్ని ప్రేమించే గుణం లేదని అన్నారు. మాటలతో చిత్తశుద్ధి నిరూపణ కాదని.. చేతలతోనే అవుతుందని చెప్పారు. 


రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 63 స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని ఎన్నికల సంఘం చెప్తోందని... 33 శాతం రిజర్వేషన్ లెక్కన ఈ ఎన్నికల్లో మీరిచ్చిన 7 సీట్లతో పాటు మరో 32 సీట్లు ఇవ్వాలని అన్నారు. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లలో మహిళల ఓట్లే అధికం కాబట్టి దమ్ముంటే మీ సీట్లను ఇప్పుడే త్యాగం చేయాలని... అప్పుడు నమ్ముతాం మహిళా బిల్లు మీ పోరాట ఫలితమేనని అని అన్నారు. దమ్ముంటే కేటీఆర్ ఈ సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు.



Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM