మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఎంఐఎం ఎంపీల ఓఓటు

byసూర్య | Wed, Sep 20, 2023, 09:33 PM

మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఎంఐఎం  ఎంపీలు ఓటు వేశారు. ఇదిలావుంటే దశాబ్దాలుగా వేచి చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు బుధవారం సాయంత్రం లోక్ సభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ సమయంలో 456 మంది ఎంపీలు ఉండగా, 454 మంది బిల్లుకు అనుకూలంగా, ఇద్దరు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినవారిలో మజ్లిస్ పార్టీ ఎంపీలు ఉన్నారు. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఇదే పార్టీకి చెందిన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ వ్యతిరేకంగా ఓటు వేశారు. 2019లో మజ్లిస్ పార్టీ మహారాష్ట్రలో ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM