byసూర్య | Thu, Jun 01, 2023, 09:01 PM
సెలవులను రద్దు చేస్తూ తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా తాజా ఉత్తర్వులు జారీ చేశారు. తాత్కాలికంగా సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే యూనివర్సిటీ హాస్టళ్లు మాత్రం తెరిచే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. జూన్ 1 నుంచి 9వ తేదీ వరకు సెలవులు ఇస్తూ వీసీ నిన్న ఉత్తర్వులు జారీ చేయగా.. విద్యార్థుల నుంచి అభ్యంతరాలు రావడంతో మళ్లీ సెలవులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.