వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్

byసూర్య | Fri, Apr 26, 2024, 08:19 PM

ఇటీవల వెల్లడైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించింది. ఆమె కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 60 మంది అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. కొందరు తొలి అటెంప్ట్‌లోనే సత్తా చాటగా.. మరికొందరు రెండు, మూడు, నాలుగు ఇలా చివరికి తమ లక్ష్యా్న్ని చేరుకున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక, కఠినమైన యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన అభ్యర్థులను నాయకులు అభినందనలు తెలుపుతున్నారు. సభలు పెట్టి ఘనంగా సత్కరిస్తున్నారు.


వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్‌ కుమార్‌ కూడా జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. సమాచారం తెలుసుకున్న నాయకులు పెద్దఎత్తున గ్రామానికి చేరుకుని యువకుడితోపాటు అతడి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. అయితే ఫలితాలు వెల్లడైన రెండ్రోజుల తర్వాత ఊహించని షాక్ తరుణు కుమార్‌కు ఎదురైంది. అసలు అతడు సివిల్స్‌లో విజయం సాధించలేదని తెలిసింది. హాల్‌టికెట్‌ నంబరు ఆధారంగా తరుణ్‌ అనే పేరుతో హరియాణాకు చెందిన యువకుడికి 231 ర్యాంకు వచ్చినట్లు తెలిసింది. ఫలితాలు వచ్చిన సమయంలో ఇంటిపేరు లేకపోవడం, ఒకే తరహా పేరు ఉండడం, పరీక్షకు హాజరు కావడంతో హల్‌టికెట్‌ నంబరును సరిగ్గా గుర్తించక తనే ఎంపికైనట్లు తరుణ్‌ పొరపాటు పడ్డాడు.


ఆ తర్వాత తాను ఐఏఎస్‌కు ఎంపికైనట్లు ప్రచారం చేసుకోవటంతో గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు అతని ఇంటికి క్యూ కట్టారు. పూల మాలలు, శాలువాలతో ఘనంగా సత్కారాలు చేశారు. అయితే చివరకు అసలు విషయం తెలియటంతో అందరూ ఖంగుతిన్నారు.


Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM