జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో

byసూర్య | Tue, May 07, 2024, 09:55 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లో అదే రిజల్ట్స్ రిపీట్ చేయాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీలకు ప్రజలు ఆకర్షితులు కావటంతో.. అదే ఊపులో పార్లమెంట్ ఎన్నికల్లో పాంచ్ న్యాయ్ పేరిట కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను ప్రకటించింది. ఇక విభజన హామీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, పసుపుబోర్డు, రైల్వే ప్రాజెక్టుల తదితర 23 అంశాలతో తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇక అభ్యర్థులు కూడా తమ తమ నియోజకవర్గాలకు స్పెషల్ మేనిఫెస్టోను ప్రకటిస్తున్నారు.


తాజాగా.. మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పట్నం సునీతా మహేందర్ రెడ్డి.. నియోజకవర్గ ప్రజలకు స్పెషల్ మేనిఫెస్టోను ప్రకటించారు. నియోజకవర్గంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను అందుబాటులోకి తెస్తామన్నారు. కాలుష్య నియంత్రణకు గ్రీన్‌ ఇండస్ట్రీలు నెలకొల్పటంతో పాటు కాలుష్య కారక పరిశ్రమలను మూసివేస్తామన్నారు. రోడ్ల మరమ్మతులు, విస్తరణ, లింకు రోడ్ల అభివృద్ధి, అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు నిర్మించి ట్రాఫిక్ రద్దీ లేకుండా చూస్తామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యాంటీ-ఫ్లడ్డింగ్‌ మౌలిక వసతుల కల్పన ఏర్పాటు చేస్తామన్నారు.


ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను అభివృద్ధి చేయడంతోపాటు జేఈఈ, నీట్‌ తదితర పరీక్షలకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. ప్రతి డివిజన్‌లో స్మార్ట్‌ హైస్కూల్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని.. బస్తీ ప్రాంతాల్లో అంగన్‌వాడీల అభివృద్ధితోపాటు ప్రతి వార్డు, డివిజన్‌లో పీహెచ్‌సీలు అందుబాటులోకి తెస్తామన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో నిత్యం వైద్యశిబిరాలు నిర్వహిస్తామన్నారు. చెరువులు, నీటి కుంటలను అభివృద్ధి చేసి చుట్టూ పార్కులను నిర్మిస్తామన్నారు. రాష్ట్రప్రభుత్వం తరఫున ఇప్పటికే మెట్రో సేవల విస్తరణకు సీఎం హామీ ఇచ్చారని.. కుత్బుల్లాపూర్, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌ వైపు ఐటీ రంగం విస్తరించడానికి కృషి చేస్తామని సునీతా మహేందర్ రెడ్డి మేనిఫెస్టోలో వెల్లడించారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM