హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

byసూర్య | Fri, Apr 26, 2024, 08:23 PM

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నామినేషన్ల పర్వం ముగియటంతో ప్రచారంలో అభ్యర్థులు దూకుడు పెంచారు. తమ పదునైన మాటలతో ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. అధికారమే లక్ష్యంగా వాడీవేడీ ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాధవీలత తన ప్రచారంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు.


ఈ నేపథ్యంలో మాధవీలతపై సినీ నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టిన రేణు దేశాయ్.. మాధవీలతను ఆకాశానికెత్తారు. మాధవీలత ఫొటోను తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేసిన రేణు... చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమన్‌ని చూశానని చెప్పారు. ఈ పోస్ట్ పెట్టడానికి తాను ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదని కూడా అన్నారు. మాధవీలత గురించి తన అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నానని... ఆ విషయాన్నే చెప్పానని రేణు దేశాయ్ ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు.


ఈ పోస్టు పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశంమైంది. ప్యాకేజీ గురించి ఆమె మాట్లాడటంపై కొందరు మండిపడుతున్నారు. తన మాజీ భర్త, జనసేన అధినేత పవన్‌ను ఉద్దేశించి ఆమె కామెంట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఆమె చేసిన కామెంట్లు విమర్శలకు తావిచ్చాయి. పవన్‌ను టార్గెట్ చేస్తూనే ఆమె పరోక్షంగా కామెంట్లు చేస్తున్నారని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇదిలా ఉండగా.. ఎంఐఎం పార్టీకి కంచుకోటగా ఉన్న హైదరాబాద్ స్థానం నుంచి మాధవీలత తొలిసారి బరిలోకి దిగుతున్నారు. హిందుత్వంపై ప్రచారం, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే ఆమె పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీజేపీలో చేరారు. అనంతరం ఆమెను హైదరాబాద్ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ప్రచారంలో దూసుకుపుతోన్న ఆమె.. ప్రత్యర్థి అసదుద్దీన్‌పై మాటల తూటాలు పేలుస్తోంది. ఆమె చేసే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM