![]() |
![]() |
byసూర్య | Sun, Mar 26, 2023, 09:45 PM
బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. విభజించు పాలించు అనే బ్రిటిష్ విధానాన్ని బీజేపీ అమలు చేస్తుందన్నారు. బీజేపీ మతాలు, ప్రాంతాలు, కులాలు, భాషల మధ్య చిచ్చు పెడుతోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'సంకల్ప్ సత్యాగ్రహ'లో రేవంత్ పాల్గొన్నారు. బ్రిటిష్ దొరలను దేశం నుంచి తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు. గాంధీ, నెహ్రూ, పటేల్‌లు దేశ నిర్మాణానికి పునాదులు వేశారని అన్నారు. కాంగ్రెస్ పునాదులతోనే భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు వచ్చిందన్నారు. దేశంలోని ఓడరేవులు, విమానాశ్రయాలు, సహజ వనరులను బ్రిటిష్ జనతా పార్టీ అదానీకి కట్టబెట్టిందని ఆరోపించారు.