![]() |
![]() |
byసూర్య | Sun, Mar 26, 2023, 09:00 PM
మహారాష్ట్రలోని కందర్ లోహాలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ సీఎం కెసిఆర్ కీలక వ్యాఖలు చేసారు. మహారాష్ట్రలోని ప్రతి జిల్లా పరిషత్‌లో గులాబీ జెండా రెపరెపలాడడమే బీఆర్‌ఎస్ పార్టీ ధ్యేయమని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలోనూ బీఆర్‌ఎస్ రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ ఎస్ పోటీ చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. తమ ప్రాంతంలో సభ నిర్వహించాలని మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి వినతులు వస్తున్నాయని... తదుపరి సభ షోలాపూర్ లో నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు.ఒకప్పుడు తెలంగాణ మహారాష్ట్ర కంటే దారుణంగా ఉండేదని... ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.