byసూర్య | Thu, Mar 23, 2023, 01:29 PM
దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి, ఉత్తరాధికారి విధుశేఖర భారతీ తీర్థ స్వామి నిర్ణయించిన ముహుర్తం ప్రకారం రేపు శుక్రవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి గర్భాలయ పునఃనిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు అంకురార్పణ చేయనున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశానుసారం పునఃనిర్మాణ పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, టీఎస్ఐడీసీ చైర్మన్ సముద్రాల వేణుగోపాల చారి ఉదయం 8 గంటలకు భూమిపూజ చేయనున్నారు.