ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి

byసూర్య | Tue, Mar 21, 2023, 07:50 PM

రంగారెడ్డి జిల్లా  ప్రజలకు రాష్ట్ర  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో  జరుపుకోవాలని కోరారు.  ముఖ్యమంత్రి కేసీఆర్  నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటోందని, ఇప్పటికే సంక్షేమాభివృద్ది కార్యక్రమాల అమలులో యావత్ దేశానికి తెలంగాణ మార్గదర్శంగా నిలుస్తోందని అన్నారు.  దినదినాభివృద్ధి సాధిస్తూ,దేశంలో అగ్రగామిగా వెలుగొందుతున్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత శ్రీ శోభకృత్ నామ సంవత్సరం లో మరింత ప్రగతి సాధించాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలు, ఆనందోత్సాహాలతో ఉండాలని ఆకాంక్షించారు.


Latest News
 

ధరణిపై రేవంత్ సర్కార్ శ్వేతపత్రం.. గులాబీ నేతల భూదందానే టార్గెట్ Mon, Feb 26, 2024, 09:37 PM
షర్ట్ చింపేసి, ఫోన్ పగలగొట్టి.. రోడ్డుపై బూతులతో లేడీ రచ్చ, వీడియో వైరల్ Mon, Feb 26, 2024, 08:46 PM
పార్టీ మమ్మల్ని పట్టించుకోలేదు.. బీఆర్ఎస్‌కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా Mon, Feb 26, 2024, 08:45 PM
అమెరికాలో పెను విషాదం.. బ్రెయిన్ స్ట్రోక్‌తో తెలంగాణ యువకుడు మృతి Mon, Feb 26, 2024, 08:43 PM
దుకాణాల్లోని మిక్చర్ బోంది తింటున్నారా.. అయితే క్యాన్సర్‌ను కొని తెచ్చుకున్నట్టే Mon, Feb 26, 2024, 08:31 PM