byసూర్య | Tue, Mar 21, 2023, 08:27 PM
ఎమ్మెల్సీ కవితపై 8 గంటల పాటు ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ కార్యాలయం దగ్గర 144 సెక్షన్ విధించారు. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కవిత లీగల్ టీమ్ ఈడీ కార్యాలయానికి చేరుకుంది. కవిత అడ్వకేట్ సోమ భరత్ కు ఈడీ నుంచి కాల్ వచ్చింది. ఈడీ అడిగిన సమాచారానికి సంబంధించిన పత్రాలను సోమ భరత్ తీసుకొచ్చారు. బీఆర్‌ఎస్ నేత దేవీప్రసాద్ సోమ భారత్‌తో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈడీ కార్యాలయంలోని మూడో అంతస్తులో కవితను ఈడీ విచారిస్తోంది.