byసూర్య | Sun, Mar 19, 2023, 11:36 AM
సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లోని సి సెక్షన్లో సమస్యలు పరిష్కరించాలని సీపీఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ అధికారులను కోరారు. శనివారం అడ్డగుట్ట సి సెక్షన్ బస్తీలో సమస్యలు పరిష్కరించాలని సీపీఐ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు సి సెక్షన్ కింది భాగం నాల పక్కన ఖాళీ స్థలం ఉండడంతో మురుగు నీరు, చెత్తచెదారం పెరిగి చెట్ల పొదల నుంచి ఏరులై పారుతుందని, పాముల భయంతో బస్తీవాసులు వణికిపోతున్నారన్నారు. ఈ ఖాళీ స్థలం మందు బాబులు అడ్డాగా మారిందన్నారు. అనేక సార్లు గొడవలు జరుగుతున్న సమ యంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా రావడంలేదన్నారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ సికింద్రాబాద్ సహాయ కార్యదర్శి ఉమర్ ఖాన్, కొమురెల్లి బాబు, పాకాల యాదగిరి, ఎస్కే లతీఫ్, శంకరయ్య, ఖాజా మీయా, ఖదీర్, రషీద్, డేవిడ్, చాంద్పాషా, ఖాజామోహినోద్దిన్, ఆహ్మద్, శంకర్, శ్రీనులు పాల్గొన్నారు.