ఘనంగా యువ నాయకుడు పుట్టినరోజు వేడుకలు

byసూర్య | Sun, Mar 19, 2023, 11:34 AM

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, అన్నా నేనున్నానంటూ భరోసానిచ్చే గొప్ప నాయకుడు, సినీ నటుడు, మాజీ కౌన్సిలర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మక్కాల నర్సింగ్ రావు జన్మదిన వేడుకలను, మక్కాల నర్సింగ్ రావు అభిమానుల మధ్యన హస్మత్ పేట్ లో శనివారం అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఘనంగా స్వాగతం పలికిన మక్కాల నర్సింగ్ రావు, ఆయన అభిమానులు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఓల్డ్ బోయిన్ పల్లి కార్పొరేటర్ ముద్ధం నరసింహ యాదవ్, లు ఇద్దరు కలిసి, మక్కల నర్సింగ్ రావును శాలువాతో ఘనంగా సత్కరించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మక్కాల నర్సింగ్ రావు మాట్లాడుతూ నా జన్మదిన సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే, కార్పొరేటర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులకు, మక్కల నర్సింగ్ రావు అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ గౌడు, కర్రే జంగయ్య, బిఆర్ఎస్ పార్టీ ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్, ప్రధాన కార్యదర్శి మేకల హరినాథ్, వార్డు మెంబర్ గడ్డం నర్సింగరావు, బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మక్కునూరి రాజేశ్వరి, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి, బీసీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్, మైనారిటీ డివిజన్ అధ్యక్షుడు జాంగిర్ భాయ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పోచయ్య, జెకె బాయ్, టిఆర్ఎస్ పార్టీ మహిళలు, కార్యకర్తలు, మక్కాల నర్సింగ్ రావు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Latest News
 

మహిళా కమిషన్ సభ్యుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి : హరీష్ రావు Mon, Jan 20, 2025, 01:10 PM
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ Mon, Jan 20, 2025, 01:07 PM
రోడ్డుపై బైఠాయించి ఆందోళన .. Mon, Jan 20, 2025, 12:52 PM
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత Mon, Jan 20, 2025, 12:49 PM
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు Mon, Jan 20, 2025, 12:42 PM