సీవరేజ్ పైపు లైన్ కు నిధులు కేటాయించాలని వినతి

byసూర్య | Sun, Mar 19, 2023, 11:31 AM

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పోరేషన్ చిల్కానగర్ డివిజన్ లోనూతన సీవరేజ్ పైప్ లైన్ కొరకు నిధులు కేటాయించాలని కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ కు శనివారం వినతిపత్రం అందజేశారు. చిల్కానగర్ డివిజన్ శివాలయం వీధి, మల్లికార్జున్ నగర్, న్యూ రాంనగర్, ధర్మపురి కాలనీ, న్యూ అండ్ సౌత్ ప్రశాంత్ నగర్ బస్తీలలో 300 డయా నూతన సీవరేజ్ పైప్ లైన్ల కొరకు నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా కాలం కిందట వేసినటువంటి సీవరేజ్ పైపులైన్లు పలుమార్లు మరమ్మతులు చేసినా సరిగా పనిచేయడం లేదని డివిజన్ వాసులు ఇబ్బంది పడుతున్నారని వాటి స్థానంలో నూతన పైప్ లైన్ వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు.


Latest News
 

ప్యాక్స్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Sat, Nov 09, 2024, 03:12 PM
పెరిగిన ఉల్లి ధరలకు ఇప్పుడు బ్రేక్ Sat, Nov 09, 2024, 03:07 PM
ఆరు గ్యారంటీలను తెలంగాణాలో అమలు చేస్తున్నాం ..మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి Sat, Nov 09, 2024, 02:55 PM
పోలీసుల తోపులాటలో సృహ తప్పి పడిపోయిన పాడి కౌశిక్ రెడ్డిని ఆసుపత్రికి తరలింపు Sat, Nov 09, 2024, 02:47 PM
ఈనెల 18వ తేది నుండి అవదూత మఠంలో ఆరాధన ఉత్సవాలు Sat, Nov 09, 2024, 02:40 PM