ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

byసూర్య | Sun, Mar 19, 2023, 10:46 AM

ప్రజా సంక్షేమ ప్రభుత్వ లక్ష్యమని ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్ని శాసన మండలి సభ్యులు వంటేరు యాదవ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి లు అన్నారు. శనివారం మార్కుక్ మండలంలోని పాతూరు గ్రామానికి చెందిన గాజా పుల్లే సత్తయ్య కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది, మృతుడు పుల్లే సత్తయ్య కు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నందున శనివారం బిఆర్ఎస్ పార్టీ నుండి 2 లక్షల లక్షల ప్రమాద బీమా చెక్కును పుల్లే జ్యోతికి ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డిలతో కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ


బాధితుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడు ప్రజా క్షేమం గా పనిచేస్తుందని చెప్పారు. బిఆర్ఎస్ పార్టీలోని ప్రతి కార్యకర్త కు కుటుంబానికి పార్టీలో ముఖ్యమంత్రి కేసీఅర్ అండగా ఉంటరని చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు చర్యలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల మాదిరిగానే దేశానికి దిక్సూచి మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ బారాస కార్యకర్తల శ్రేయస్సు కోసం 2లక్షల ప్రమాద భీమ లాంటి సౌకార్యాన్ని కల్పించారన్నారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గౌరవంగా జీవించేందుకు అనేక పథకాలను పార్టీ అమలు చేస్తుందని చెప్పారు. కార్యకర్తలను కాపాడుకునేది ఒక్క బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అనీ వేరే ఇతర పార్టీలు ఇట్లాంటి ప్రమాద బీమా కానీ కార్యకర్తల గురించి ఎలాంటి వాటిని ఇవ్వలే దన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలన్న మృతుని కుటుంబానీ 2లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగిందన్నారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. కార్యకర్తలకు అండగా బారాస పార్టీ ఉంటుందనన్నారు. ఈ కార్యక్రమంలొ వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, సర్పంచ్ అరుణ నర్సింలు, మల్లేశ్, కృష్ణ, శివా రెడ్డి, కనకయ్య, కృష్ణ, కుమార్, రమేష్, కరుణాకర్ కుమార్, స్వామి, బలరాం, ప్రశాంత్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM