పరీక్ష పత్రాల లీకేజీలో కేటీఆర్ పిఏ: పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

byసూర్య | Sun, Mar 19, 2023, 10:26 AM

టి ఎస్ పి ఎస్ సీ పరీక్ష పత్రాల లీకేజీలో మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతికి భాగస్వామ్యం ఉందని, ఆయన ద్వారా సిరిసిల్ల జిల్లా మల్యాల మండలానికి చెందిన 100 మందికి వందకు పైగా మార్కులు వచ్చినట్టు తమకు సమాచారం ఉందని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హాద్ సే హాద్ జోడో యాత్రలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా రాజంపేట కార్నర్ మీటింగ్, కామారెడ్డిలో జరిగిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సిబిఐ పై నమ్మకం లేకుంటే సిట్టింగ్ జడ్జి చేత ఈ వ్యవహారం పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లీకేజీలో మంత్రి కార్యాలయానికి సంబంధం ఉండడం వల్లే విచారణ జరగకుండా చూస్తున్నారని ఆరోపించారు. లీకేజీ వ్యవహారంలో 9 మందిని అరెస్టు చేస్తే కేటీఆర్ మాత్రం ఇద్దరే దొంగలు అన్నట్లు చెప్పడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. ప్రశ్న పత్రాల లీకేజీలో చిన్న చేపలను బలి చేసి, చైర్మన్, బోర్డు మెంబర్లు, సీఎం కేసీఆర్, కేటీఆర్ తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు.


Latest News
 

ఇక వర్షాలే..ఎండ తీవ్రత నుంచి ఉపశమనం Sun, Mar 16, 2025, 07:33 PM
తెలంగాణ యువతకు .. ఒక్కొక్కరికి రూ. 3 నుంచి 5 లక్షలు Sun, Mar 16, 2025, 06:12 PM
అర్ధరాత్రి వేళ ప్రవేశించిన ఆగంతకుడు..బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం Sun, Mar 16, 2025, 05:50 PM
మా ప్రభుత్వం వచ్చాకే.. వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్, రింగ్‌రోడ్డు ... సీఎం రేవంత్‌రెడ్డి Sun, Mar 16, 2025, 05:47 PM
పీఎం ఆవాస్ యోజన పథకం.. వెబ్‌సైట్లో లబ్ధిదారుల లిస్ట్.. Sun, Mar 16, 2025, 05:43 PM