డబుల్ బెడ్ రూమ్ బిల్లుల పంపిణీ చేసిన ఎంపిపి, జెడ్పిటిసి

byసూర్య | Sun, Mar 19, 2023, 10:29 AM

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలం నిన్న శనివారం రెండవ విడత డబుల్ బెడ్ రూమ్ ఇల్లుల బిల్లులు రుద్రూర్ మండలం లోని రాణంపల్లి గ్రామంలో ఎంపిపి అక్కపల్లి సుజాత నాగేందర్, జెడ్పిటిసి నారోజి గంగారాం, మండల బిఆర్ఎస్ అద్యక్షులు పత్తి లక్ష్మణ్ ఆధ్వర్యంలో లబ్ది దారులకు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఎంతోమందికి మేలు జరుగుతుందని సొంతింటి కలను సహకారం చేసుకునే భాగ్యాన్ని కలిగించిన కెసిఆర్ కు, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నేరుగంటి బాలరాజు తెలియజేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తోట సంగయ్య, కాసుల పోశెట్టి, మీసేవ శంకర్, లబ్ది దారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM