మహిళల భద్రత కోసం...ప్రత్యేక బస్సులు తీసుకొచ్చిన టీ సర్కార్

byసూర్య | Sat, Mar 18, 2023, 09:27 PM

మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర సర్కార్  పట్టిష్ట చర్యలు  తీసుకొంటోంది. తాజాగా హైదరాబాద్ సిటీలో మహిళల భద్రత కోసం రెండు షీ షటిల్ సర్వీసులు ప్రారంభమయ్యాయని ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. శుక్రవారం రాయదుర్గం జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఉమెన్స్ కాంక్లేవ్ అండ్ అవార్డుల కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బస్సును తయారుచేశారని తెలిపారు. మహిళలకు అన్ని సౌకర్యాలు ఉండేటట్లు ఏర్పాటు చేశారని వివరించారు. భద్రతకోసం బస్సులో ఓ సెక్యూరిటీగార్డు కూడా ఉంటారని నిర్వాహకులు తెలిపారు. సైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో గ్రాండ్ గా జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ ముఖ్య అతిధి కాగా, సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఎస్ సీ ఎస్ సీ సెక్రటరీ కృష్ణ ఏదుల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM