బీఆర్ఎస్ పెద్ద తలకాయలు బయటకు రావాలి: రేవంత్ రెడ్డి

byసూర్య | Sat, Mar 18, 2023, 09:01 PM

పేపర్  లీకేజీ కేసులో చిన్న చిన్న వాళ్లను అరెస్ట్ చేయడం కాదని, ప్రశ్నాపత్రం లీకేజి వెనుక ఉన్న బీఆర్ఎస్ పెద్ద తలకాయలు బయటికి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ తతంగం వెనుక ఉన్న తిమింగలాలకు బహిరంగ శిక్ష విధించాలని పేర్కొన్నారు.  కామారెడ్డి జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా రేవంత్ రెడ్డి రాజంపేట గ్రామంలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పైరవీకారులకు ముందే ప్రశ్నాపత్రాలు అందుతున్నాయని తెలిపారు. ఘటనకు బాధ్యుడైన మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 


తాను ఐటీ మంత్రినని, ఈ వ్యవహారంతో తనకేంటి సంబంధం అని కేటీఆర్ అంటున్నారు... మరి ముఖ్యమంత్రి ఈ అంశంపై సమీక్ష జరిపితే నువ్వెందుకు హాజరయ్యావు? అని కేటీఆర్ ను నిలదీశారు. నీకేమీ సంబంధం లేకపోతే ఇవాళ ఒకవైపు విద్యాశాఖా మంత్రిని, మరోవైపు ఎక్సైజ్ శాఖామంత్రిని ఎందుకు కూర్చోబెట్టుకుని మాట్లాడావు? ఐటీ మంత్రివి అయిన నీవు అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? సమీక్ష సమావేశంలో సిట్ అధికారులను ఎందుకు కూర్చోబెట్టలేదు? అని ప్రశ్నించారు. 


ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేస్తే, ఇద్దరే నేరానికి పాల్పడ్డారని మంత్రిగా ఏ విధంగా ప్రకటన చేస్తారు? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఇప్పటివరకు ఆ 9 మందిని విచారణ చేయలేదని, మరి కేటీఆర్ ఇద్దరే ఈ తప్పిదానికి పాల్పడ్డారని ఎలా చెబుతారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని దీనితో స్పష్టమైందని అన్నారు. కేటీఆర్ తన ప్రకటన ద్వారా బీఆర్ఎస్ లో ఉన్న పెద్ద తలకాయలను కాపాడారని రేవంత్ ఆరోపించారు. అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికే కేటీఆర్ ఈ ప్రకటన చేశారా? ఇంటి దొంగలు బయటపడతారనే కేటీఆర్ హడావుడి చేస్తున్నారు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.



Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM