తెల్లవారితే కూతురు పెళ్లి ,,,,తండ్రి గుండె ఆగడంతో విషాధం

byసూర్య | Sat, Mar 18, 2023, 09:01 PM

తెలంగాణ రాష్ట్రానికి హార్ట్ ఎటాక్ వెంటాడుతోంది. ఇటీవల రాష్ట్రంలో ఈ తరహా మరణాలు పెరిగిపోయాయి. పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పులు మోగాయి. అప్పటివరకు సంతోషం అలుముకున్న ఆ ఇంట్లో విషాదం నెలకొంది. నూతన దంపతులను ఆశీర్వదించేందుకు పెళ్లికి వచ్చిన బంధువులు.. అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చింది. తెల్లారితే కుమార్తె పెళ్లి అనగా.. ఓ తండ్రి గుండెపోటుతో కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. కూసుమంచి మండల కేంద్రానికి చెందిన అర్జున్ ఖమ్మంలోని హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 18న (ఈరోజు) ఆయన తన కూతురికి పెళ్లి నిశ్చయం చేశారు. బంధు మిత్రులందరికీ చెప్పుకొని తన కూతురు వివాహాన్ని ఘనంగా చేయాలనుకున్నాడు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. మెహాందీ, పెళ్లి కూతుర్ని చేసే కార్యక్రమం ఇలా అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నాడు. పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులతో ఇంట్లో సందడి నెలకొంది. ఇంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.


ఈనెల 16న రాత్రి 10 గంటల సమయంలో అర్జున్‌ గుండెపోటుకు గురయ్యాడు. గదిలో ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు, బంధువులు.. ఆయన్ను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. అర్జున్ శుక్రవారం (ఈనెల 17న) తెల్లవారుజామున కన్నుమూశాడు. దీంతో పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇంట కుంటుంబసభ్యులు, బంధువుల రోదనలతో విషాదం అలుముకుంది.



Latest News
 

మాగంటి గోపీనాథ్ మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన తల్లి Sun, Nov 09, 2025, 06:22 AM
హరీశ్ రావు సవాల్: జూబ్లీహిల్స్ ఓటర్లు తేల్చండి – లేడీనా, రౌడీనా? Sat, Nov 08, 2025, 11:45 PM
బండి సంజయ్ సంచలనం: మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ, ఆస్తులు కొట్టేందుకు కుట్రల ఆరోపణలు Sat, Nov 08, 2025, 11:36 PM
KTR సిగ్నల్: 14 తర్వాత రాష్ట్రంలో ఎవరు దూకుడుగా ఉంటారో గమనిస్తాం!” Sat, Nov 08, 2025, 11:17 PM
“జూబ్లీహిల్స్ రాజకీయ రణభూమి: టీడీపీ-బీజేపీ గ్యాప్ పెరుగుతోంది” Sat, Nov 08, 2025, 10:47 PM