సీఎంతో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ భేటీ

byసూర్య | Sat, Mar 18, 2023, 09:00 PM

తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ప్రగతి భవన్ లో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు మాజీ ఛైర్మన్ గంటా చక్రపాణి కూడా ప్రగతి భవన్ చేరుకున్నారు. వీరితో పాటు మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, సీఎస్ శాంతి కుమారి కూడా సీఎంతో భేటీలో పాల్గొన్నారు. పేపర్ లీక్, పరీక్షల రద్దు అంశాలపై సీఎంకు వివరిస్తున్నట్లు సమాచారం. భేటీ తర్వాత టీఎస్‌పీఎస్సీ వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.


ఇక ఈ కేసులో తొమ్మిది మంది నిందితులు.. ఏ 1 ప్రవీణ్ కుమార్, ఏ 2 అట్ల రాజశేఖర్, ఏ3 రేణుక రాథోడ్, ఏ4 డాక్య, ఏ 5 కేతావత్ రాజేశ్వర్, ఏ 6 కేతావత్ నీలేష్ నాయక్, ఏ 7 పత్లావత్ గోపాల్ నాయక్, ఏ 8 కేతావత్ శ్రీనివాస్, ఏ 9 కేతావత్ రాజేంద్ర నాయక్‍లపై సెక్షన్ 420, 409, 120 B, ఐటి యాక్ట్ 66 బీ, సీ 70 ఆఫ్ ఐటి యాక్ట్ సెక్షన్ 4 ఆఫ్ తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు. తొమ్మిది మంది నిందితులకు నాంపల్లి కోర్టు ఆరు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. ప్రస్తుతం నిందితులు చంచల్‌గూడ జైలులో ఉండగా.. వారిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిందితుల ఆర్థిక లావాదేవీలతో పాటు ప్రశ్నా పత్రాలు ఎవరెవరికి విక్రయించారనే దానిపై ఆరా తీయనున్నారు.


మరోవైపు గతేడాది అక్టోబర్ 16వ తేదీన జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షను జూన్ 11న మళ్లీ నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు ఈ ఏడాది జనవరి 22న జరిగిన ఏఈఈ , ఫిబ్రవరి 26న జరిగిన డీఏఓ పరీక్షలను కూడా టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. అయితే.. ఈ పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. మరోవైపు.. జూలైలో జరగాల్సిన జూనియర్ లెక్చరర్ పరీక్షలను కూడా వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. జేఎల్ పరీక్ష కూడా పేపర్ లీక్ అయినట్లుగా టీఎస్‌పీఎస్సీ అధికారులు గుర్తించారు.



Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM