మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్

byసూర్య | Thu, Oct 17, 2024, 09:00 PM

మూసీ రివర్ ఫ్రంట్‌పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేపు అన్ని వివరాలు చెబుతానన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ టెండర్ రూ.141 కోట్లు అయితే లక్షన్నర కోట్ల రూపాయల ప్రాజెక్టు అని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ మీడియా సమావేశంపై కేటీఆర్ స్పందించారు. మూసీకి సంబంధించి రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని వెల్లడించారు. రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందన్నారు. మూసీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను వివరిస్తామన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం చేసిన ప్రయత్నాలు, ప్రణాళికలను వివరిస్తామన్నారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM