పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్

byసూర్య | Thu, Oct 17, 2024, 10:00 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఉదయం నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆయన పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో ఆయన కోర్టుకు హాజరై స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ కూడా వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఉదయం 11.30 గంటలకు కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు.కొండా సురేఖ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, పరువుకు నష్టం కలిగించారంటూ కేటీఆర్ ఈ నెల 3న నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 14న విచారణ జరిపిన న్యాయస్థానం విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాలను శుక్రవారం నాడు నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు రేపు కోర్టుకు హాజరు కానున్నారు. కాగా, కోర్టులో 23 రకాల ఆధారాలను కేటీఆర్ తరఫు న్యాయవాది సమర్పించారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM