![]() |
![]() |
byసూర్య | Sat, Mar 18, 2023, 08:12 PM
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్,మీర్పేట్ కార్పొరేషన్లు, జల్ పల్లి మునిసిపాలిటీ లలో రోడ్ల నిర్మాణానికి 13 కోట్ల 80 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రత్యేక చొరవ చూపి హెచ్ఎండిఏ నిధులు మంజూరు చేసారని ఆయా కార్పొరేషన్ల ప్రజల తరుపున ముఖ్యమంత్రి గారికి,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. బడంగ్పేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మారుతి నగర్ నుండి అల్మాస్ గూడ మెయిన్ రోడ్డు వరకు రెండు కోట్లతో బీటీ రోడ్డు, గుర్రం గూడ మెయిన్ రోడ్డు నుండి అదిత్యనగర్ సాయిబాబా టెంపుల్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ఒక కోటి 50 లక్షలు,బడంగ్పేట్ మెయిన్ రోడ్డు నుండి శ్రీనిలయం కాలనీ వరకు ఒక కోటి 20 లక్షలు, ఏజిఆర్ కాలనీ నుండి సుభ్రమన్య కాలనీ వయా మౌంట్ కార్మెల్ స్కూల్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ఒక కోటి 50 లక్షలు, అల్మాస్ గూడ సబ్ స్టేషన్ (ఎర్ర కుంట) నుండి శ్రీ హిల్స్ వయా మధుర నగర్ బీటీ రోడ్డుకు ఒక కోటి 30 లక్షల నిధులు విడుదల చేయించినట్లు తెలిపారు. అదేవిధంగా మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో ఒక కోటి 20 లక్షల రూపాయలతో ఆర్ సి ఐ రోడ్డు నుండి వయా డి ఎన్ ఆర్ కాలనీ,లలిత నగర్,నందనవనం వరకు రోడ్డు వెడల్పు పనులకు,65 లక్షలతో రాఘవేంద్ర నగర్ నుండి న్యూ గాయత్రి నగర్ వరకు రోడ్డు వెడల్పు పనులకు,60 లక్షలు అంబెడ్కర్ విగ్రహం నుండి గాయత్రి నగర్ వరకు రోడ్డు వెడల్పు పనులకు,85 లక్షలు ఆటో స్టాండ్ , పోస్ట్ బాక్స్ నుండి మీర్పేట్ లైబ్రరీ వరకు రోడ్డు పనులకు, జల్ పల్లి మునిసిపాలిటీ లో 11/0 నుండి 11/4 శ్రీశైలం హై వై (ఎన్ హెచ్ 765) వయా పహడి షరీఫ్ దర్గా రోడ్డు వెడల్పు పనుల కు ఒక కోటి 50 లక్షల నిధులు మంజూరు అయ్యాయని మంత్రి తెలిపారు.