విద్యార్థులు ఎలాంటి వత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి

byసూర్య | Sat, Mar 18, 2023, 07:53 PM

నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని మంతటి, గగ్గలపల్లి గ్రామాలలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో వాసవి క్లబ్ పూర్వ అధ్యక్షులు వాసా రాఘవేందర్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 10వ తరగతి చదువుతున్న బాల బాలికలకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులు బహుకరించారు. ఈ సందర్భంగా చిగుళ్లపల్లి జ్యోతి రమణ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని అప్పుడే మంచి మార్కులు సాధించగలరని అన్నారు. మొదటగా పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన విద్యార్థులు ప్రశ్నాపత్రం మొత్తం పరిశీలన చేసిన తర్వాత వచ్చిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో ఆలోచించినప్పుడు మిగిలిన ప్రశ్నలకు కూడా సమాధానం దొరుకుతాయి అని అన్నారు. కాబట్టి విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హనుమాన్ విగ్రహానికి పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు Tue, Apr 23, 2024, 04:22 PM
నల్గొండలో కుటుంబ పాలన నడుస్తుంది: శానంపూడి సైదిరెడ్డి Tue, Apr 23, 2024, 04:19 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్ Tue, Apr 23, 2024, 03:37 PM
24న మోటార్ సైకిల్ల వేలం పాట Tue, Apr 23, 2024, 03:14 PM
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM