హైదరాబాద్‌లో పలు చోట్ల భీకర వడగండ్లు,,,మరో రెండు రోజులు ఇదే పరిస్థితి

byసూర్య | Sat, Mar 18, 2023, 07:52 PM

మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో వర్షాలకు  అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలావుంటే శనివారంనాడు నగరంలో భారీ వర్షం కురిసింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో.. సికింద్రాబాద్‌లోని అల్వాల్, బొల్లారం, తిరుమలగిరి పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, రామచంద్రపురం, అమీన్‌పూర్, జిన్నారం, గుమ్మడిదల, రామచంద్రాపురం, బీహెచ్‌ఈఎల్, తెల్లాపూర్ పరిసర ప్రాంతాలలో వడగండ్ల వాన పడింది. బానూరు, నందిగామ, ముత్తంగిలోనూ వడగండ్లు కురిశాయి. శేరిలింగంపల్లిలోని చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా వడగండ్ల వాన పడింది.


భారీ వర్షం కారణంగా.. నగరంలోని రోడ్లు మొత్త జలమయమయ్యాయి. రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావటంతో.. రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతోంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వడగళ్ల వాన పడుతోంది. అకాల వర్షం కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. మరో రెండు రోజుల పాటు అటు హైదరాబాద్‌తో పాటు ఇటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అవసరం ఉంటే తప్ప బయటకి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.



Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM