పంటను కొన లేని చేత కానీ బి ఆర్ ఎస్ రాష్ట్ర ప్రభుత్వం

byసూర్య | Sat, Mar 18, 2023, 07:51 PM

అలంపూర్ నియోజకవర్గ అధ్యక్షులు మహేష్ రైతులు ఎంతో కష్టపడి , చెమటోడ్చి పంటను పండించి అమ్ముదాం అని మార్కెట్ కు వెళ్లి వారం రోజులు కావస్తున్న పండించిన పంటను కొనలేని పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని శనివారం అన్నారు. గత వారం క్రితం గోనె సంచులు లేక ఇబ్బందులు పడుతుంటే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ రాష్ట్ర మార్కెఫెడ్ అధికారులతో మాట్లాడి వెంటనే గోనె సంచులు వొచ్చే విధంగా కృషి చేశారు అని బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు మహేష్ అన్నారు. శనివారం బీఎస్పీ పార్టీ నాయకులు అలంపూర్ చౌరస్తాలో ఉన్న మార్కెట్ యార్డ్ కు వెళ్లి రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు వారం రోజులు కావస్తున్న మాకు గోనె సంచులు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. అధ్యక్షులు మహేష్ మార్కెఫెడ్ అధికారులతో చరవాణిలో మాట్లాడి వెంటనే సంచులు వొచ్చే విధంగా చూడాలి అని అన్నారు. ఉండవల్లి మండల అధ్యక్షులు ప్రభుదాస్ మాట్లాడుతూ ఎకరాకు కేవలం 6 క్వింటాలు మాత్రమే కొంటున్నారు అని మిగతా పంట ఎవరు కొనాలని ప్రశ్నించారు. వెంటనే రైతు పండించిన మొత్తం పంట కొనాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ మండల అధ్యక్షులు నాగరాజు, ఉండవల్లి మండల ఉపాధ్యక్షులు శివ కుమార్ పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో డిసెంబర్ 9 నుండి రెండు గ్యారంటీల అమలు Thu, Dec 07, 2023, 11:07 PM
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ Thu, Dec 07, 2023, 09:12 PM
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం Thu, Dec 07, 2023, 08:45 PM
బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే.. అలా చేస్తే.. Thu, Dec 07, 2023, 03:33 PM
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి.. Thu, Dec 07, 2023, 03:31 PM