ఆధ్యాత్మిక మార్గంలోనే శాంతిస్థాపన

byసూర్య | Sat, Mar 18, 2023, 07:28 PM

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం ద్వారానే సమాజంలో శాంతి నెలకొంటుందని వీరబ్రహ్మేంద్రస్వామి ముని మనవడు వీరంబోట్లయ్య స్వామి అభిప్రాయపడ్డారు. శనివారం బ్రహ్మంగారి మఠం నుంచి కర్నూలు షణ్ముఖ ఆశ్రమ పీఠాధిపతి కృష్ణ స్వామితో కలిసి హైదరాబాద్ వెళుతూ శనివారం ఉదయం జడ్చర్లలో బాద్మి శివకుమార్, రవిశంకర్ ల గృహంలో కొద్ది సేపు ఆగారు. స్వాములకు శివకుమార్ రవిశంకర్ లతో పాటు విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. శాలువా పూలమాలలతో సత్కరించి ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ కాలజ్ఞాన సృష్టికర్త వీరబ్రహ్మేంద్రస్వామి ఆశించినట్లుగా కుల మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు సమానత్వంలో ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరు దైవారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. స్వాములను కలిసిన వారిలో రవీందర్ చారి, శేఖర్ చారి, ప్రభాకర్ చారిలు ఉన్నారు.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM