స్థానిక సంస్థల పాఠశాలల్లో పేరెంట్, టీచర్ ల సమావేశం

byసూర్య | Sat, Mar 18, 2023, 07:47 PM

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా శనివారం అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పేరెంట్, టీచర్ మీటింగ్స్ ను ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని 825 పాఠశాలల గాను 740 పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించారు. 825 పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు 72, 224 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి సంబంధించిన 60, 608 మంది పేరెంట్స్కు గాను నేటి పేరెంట్ సమావేశాలకు 38, 556 మంది పేరెంట్స్ హాజరయ్యారని నాగర్ కర్నూలు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి బరపటి వెంకటయ్య తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు, ముగ్గురు పిల్లలు పలు పాఠశాలల్లో చదువుతున్నవారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో టీచర్స్ పేరెంట్ సమావేశాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని డిఈఓ గోవిందరాజులు తెలిపారు. జిల్లాలో నేడు నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు నివేదికలను డాక్యుమెంటేషన్ ద్వారా రాష్ట్రస్థాయి అధికారులకు పంపించి చర్చించిన అంశాల వారిగా వచ్చే అకాడమీక్ ఇయర్లో తల్లిదండ్రుల సూచనలను తీసుకుంటామని డిఈఓ గోవిందరాజులు తెలిపారు.


Latest News
 

కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు Thu, Sep 28, 2023, 08:55 PM
ఘనంగా ఖైరతాబాద్‌ గణేశుడు నిమజ్జనం Thu, Sep 28, 2023, 02:51 PM
నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ Thu, Sep 28, 2023, 01:53 PM
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ Thu, Sep 28, 2023, 01:53 PM
మార్చని ఇంటి నంబర్ లు. పెరిగిన ఓటర్ల సంఖ్య Thu, Sep 28, 2023, 01:52 PM