మహిళా కమిషన్ ఎదుట హాజరైన సంజయ్ సంజయ్... ఆ వాఖ్యలపై వివరణ

byసూర్య | Sat, Mar 18, 2023, 07:50 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులుపై వివరణ ఇచ్చేందుకుగానూ సంజయ్ ఇవాళ మహిళా కమిషన్‌ ఎదుట హాజరయ్యారు. భాజపా లీగల్‌ సెల్‌ ప్రతినిధులతో కలిసి ఆయన కమిషన్‌ కార్యాలయానికి వెళ్లారు. రెండు పేజీల లేఖలో వివరణ ఇచ్చారు. కవితను ఉద్దేశించి మాట్లాడిన మాటలను సంజయ్ సమర్థించుకున్నారు. తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలనే తాను మాట్లాడినట్లు లేఖలో సమాధానం ఇచ్చారు. తెలంగాణ కుటుంబ సభ్యులు ఉపయోగించే భాషనే ఉపయోగించినట్లు కమిషన్ ముందు వెల్లడించారు. అయితే బండి సంజయ్ సమాధానం పట్ల మహిళా కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది.


మరోవైపు.. బండి సంజయ్ మహిళా కమిషన్ కార్యాలయానికి వస్తున్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకున్నారు. సంజయ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో పరిస్థితి సద్దుమమణిగింది.


ఇదిలావుంటే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై ఇటీవల సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సంజయ్ వ్యాఖ్యలను సమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 13న వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే.. తనకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నందన ఇవాళ (ఈనెల 18న) హాజరవుతానంటూ సంజయ్ మహిళా కమిషన్‌కు లేఖ రాశారు. ఈ మేరకు ఇవాళ విచారణకు హాజరైన ఆయన తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM