అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలి

byసూర్య | Sat, Mar 18, 2023, 07:24 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ జిల్లా కన్వీనర్ పొదిల రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు పోరాటాల ఫలితంగా సాధించుకున్న జీవోల ప్రకారం వేతనాలు చెల్లించకుండా కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారని అన్నారు. మరొక వైపు అధిక పని గంటలు ఈఎస్ఐ పిఎఫ్ సక్రమంగా అమలు చేయకపోవడం కనీసం చేస్తున్న పనికి ఎంత వేతనం వస్తుందో కూడా తెలియని పరిస్థితి కార్మికుల్లో ఉందని వారు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజ్ జనరల్ ఆస్పత్రులలో కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటంతో పని భారం పెరిగి కార్మికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్మికుల సంఖ్యను పెంచి దానికి అనుగుణంగా వేతనాలు పెంచాలని కార్మికులకు సేఫ్టీ పరికరాలు సబ్బులు నూనెలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతర ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు సాయమ్మ అన్నపూర్ణ రేణుక రామేశ్వరమ్మ మహేశ్వరి వరలక్ష్మీ చంద్రకళ చెన్నమ్మ పావని లక్ష్మీ శ్వేత నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM